Wednesday, October 28, 2026
Homeక్రైమ్ న్యూస్ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. నగదు, వెండి ఆభరణాలు అపహరణ

ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. నగదు, వెండి ఆభరణాలు అపహరణ

📰 Generate e-Paper Clip

  • హుండీ పగులగొట్టి రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

మానకొండూర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం గంగిపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగులగొట్టి సుమారు రూ.20 వేల నగదుతోపాటు రెండు తులాల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనపై గంగిపల్లి గౌడ సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో చోరీకి పాల్పడిన వారిని త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలోని ఆలయాల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు రాత్రివేళ పోలీసు గస్తీని ముమ్మరం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!