- త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లో చేరాలని ఆకాంక్ష
ఆమనగల్లు, నవంబర్ 18 (చైతన్యగళం): ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన సిబ్బంది నేనావత్ మాల్యా నాయక్ ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం వెల్దండ మండలంలోని యోన్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆసుపత్రికి వెళ్లి మాల్యా నాయక్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మాల్యా నాయక్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

