Thursday, November 19, 2026
Homeతెలంగాణవిష్ణు మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

విష్ణు మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

📰 Generate e-Paper Clip

  • కానుగుల దశరథం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన నాయకులు

తలకొండపల్లి, నవంబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కానుగుల దశరథం అల్లుడు విష్ణు మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విష్ణు మృతి విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఆమనగల్ పీఏసీఎస్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కానుగుల దశరథంతో పాటు విష్ణు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్ యాదవ్, మైనారిటీ మండల అధ్యక్షుడు ఆరిఫ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చెన్నకేశవులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, తాలూకా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు జూలపల్లి శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!