- పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి యువత కృషి చేయాలి: జిల్లా అధ్యక్షుడు నరేష్ చారి
వెల్దండ, నవంబర్ 18 (చైతన్యగళం): కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నూతన మండల కమిటీల నియామక కార్యక్రమం నిర్వహించారు. మండల బీజేవైఎం అధ్యక్షుడు బాణావత్ అరుణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నాగర్‌కర్నూల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన యువ నాయకులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నరేష్ చారి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన యువ నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నూతన కమిటీలో మండల ఉపాధ్యక్షులుగా ఏ. జగన్, కే. శరత్, ఎన్. గణేష్, ఎం. సైదులు; ప్రధాన కార్యదర్శులుగా టీ. వంశీ, కే. అంజనేయులు; కార్యదర్శులుగా ఎం. విష్ణు, ఎన్. కుమార్, ఎం. శివచారి, శివ; అధికార ప్రతినిధులుగా శ్రీకాంత్, రాము, టీ. శ్రీకాంత్ నియమితులయ్యారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు రవి రాథోడ్, ఆమనగల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కర్నాటి విక్రమ్ రెడ్డి, జిల్లా గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ నాయక్, బీజేవైఎం మాజీ అధ్యక్షుడు రవి, బీజేపీ సీనియర్ నాయకుడు పులి, సునీల్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన వెల్దండ మండల బీజేవైఎం నాయకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

