- 300 క్వింటాళ్ల బియ్యం మాయమైనట్లు అనుమానం
అచ్చంపేట, నవంబర్ 12 (నీలగిరి ఎక్స్‌ప్రెస్): అచ్చంపేట పట్టణంలోని 13వ నంబరు రేషన్ దుకాణాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాజేందర్, ఏఎస్వో హైదర్ అలీ తనిఖీలు నిర్వహించి ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల కోటా పంపిణీ ప్రారంభమై 12 రోజులు గడిచినా దుకాణం తెరవడం లేదని ఫిర్యాదులు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డీలర్ మాణిక్యమ్మకు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో దుకాణాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. దాదాపు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తనిఖీల పూర్తి వివరాలు, సీజ్‌కు గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
