Sunday, November 15, 2026
Homeక్రైమ్ న్యూస్ఎల్కతుర్తి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి.. ముగ్గురిపై కేసు

ఎల్కతుర్తి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి.. ముగ్గురిపై కేసు

📰 Generate e-Paper Clip

  • పెట్రోల్ పోయడంలో ఆలస్యమైందంటూ ఉద్యోగిపై దాడి చేసినట్లు ఫిర్యాదు

ఎల్కతుర్తి, నవంబర్ 14 (చైతన్యగళం):

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్కతుర్తి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ గ్రామానికి చెందిన కుక్కల కార్తీక్ (భిక్షపతి కుమారుడు) ఎల్కతుర్తిలోని పెట్రోల్ బంక్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో కార్తీక్ విధుల్లో ఉండగా ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోయించుకునేందుకు బంక్‌కు వచ్చారు. పెట్రోల్ పోయడంలో ఆలస్యమైందనే కారణంతో వారు తనను అసభ్య పదజాలంతో దూషించి, పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేష్, శ్రీనివాస్, వంశీ అనే ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు దండేపల్లి వీరనారాయణపూర్, చింతలపల్లి గ్రామాలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!