ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. నగదు, వెండి ఆభరణాలు అపహరణ
హుండీ పగులగొట్టి రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు మానకొండూర్, అక్టోబర్ 28 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగులగొట్టి సుమారు రూ.20 వేల నగదుతోపాటు రెండు తులాల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై గంగిపల్లి గౌడ సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో చోరీకి పాల్పడిన వారిని త్వరగా గుర్తించి...