Tuesday, October 27, 2026
Homeక్రైమ్ న్యూస్11 కేవీ విద్యుత్‌ తీగ తగిలి నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

11 కేవీ విద్యుత్‌ తీగ తగిలి నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

  • మహమ్మదాపూర్‌లో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం.. వరంగల్‌ ఎంజీఎంకు తరలింపు

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహమ్మదాపూర్‌ గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్‌ తీగ తగిలి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఈ ప్రమాదంలో కల్లూరి రాధ (25), కత్తుల రజిత, చిర్ర రాజు (36), కుంచం సంతోష్‌ (34) గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నలుగురినీ వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

వారిలో కల్లూరి రాధ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఆమె చెవుల నుంచి రక్తస్రావం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో మహమ్మదాపూర్‌ గ్రామంలో ఆందోళన నెలకొంది. ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!