11 కేవీ విద్యుత్‌ తీగ తగిలి నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

మహమ్మదాపూర్‌లో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం.. వరంగల్‌ ఎంజీఎంకు తరలింపు హుస్నాబాద్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహమ్మదాపూర్‌ గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్‌ తీగ తగిలి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో కల్లూరి రాధ (25), కత్తుల రజిత, చిర్ర రాజు (36), కుంచం సంతోష్‌ (34) గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి...