మహబూబ్‌నగర్
వెల్దండ, అక్టోబరు 2 (చైతన్యగళం): మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ప్రసాద్‌గౌడ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని...
కరీంనగర్
సభ విజయాన్ని జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నారన్న కొరివి అరుణ్‌కుమార్ కరీంనగర్, అక్టోబరు 2 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా నిర్వహించిన సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి...
కరీంనగర్
రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు కరీంనగర్, అక్టోబరు 2 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి...
తెలంగాణ
గాంధీ పార్క్‌లో ఎమ్మెల్యే మురళీనాయక్ నివాళులు మహబూబాబాద్, అక్టోబరు 2 (చైతన్యగళం): గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం పార్క్ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘స్వచ్ఛత హీ సేవా–2026’లో భాగంగా అన్ని...
తెలంగాణ
అమృత్ భారత్ పనుల పరిశీలన.. అదనపు సౌకర్యాలపై దృష్టి మహబూబాబాద్, అక్టోబరు 2 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, ప్రయాణికులు, పట్టణ ప్రజలతో పర్యావరణ పరిరక్షణపై...
తెలంగాణ
కుటుంబ బంధాలకు నర్మదా ఓ ఆదర్శం బొడ్ల వెంకటయ్య 80వ జన్మదిన వేడుకల్లో కుటుంబ విలువలకు ప్రాధాన్యం మహబూబాబాద్, అక్టోబరు 2 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌వీఎల్ ఫంక్షన్‌హాల్‌లో బొడ్ల వెంకటయ్య 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉగ్రశాంతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ ముడుంబై లక్ష్మీనారాయణాచార్యుల ఆధ్వర్యంలో ఆవాహిత కలశారాధన, రుద్రాభిషేకం,...
తెలంగాణ
రైతుల సేవలకు గుర్తింపుగా పురస్కారం హైదరాబాద్, అక్టోబరు 2 (చైతన్యగళం): రైతుల సేవలకు గుర్తింపుగా బి. హరి వెంకట ప్రసాద్‌కు ‘కిసాన్ సేవా రత్న’ అవార్డు లభించింది. మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు...
కరీంనగర్
కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, సంబంధిత ఏసీపీల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఆయుధాలు ధరించి...
కరీంనగర్
కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌లో హియరింగ్ కాకుండా ఉన్న 25 వేల నోటీసులకు సంబంధించి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సరైన ధ్రువపత్రాలు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూపర్‌వైజర్లను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల ఎమ్మార్వోలు, బీఎల్వో...
కరీంనగర్
కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ నగరపాలక సంస్థలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు గత మూడు నెలలుగా క్రమం తప్పకుండా వేతనాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సిబ్బంది, కార్మికుల సంక్షేమాన్ని...
కరీంనగర్
హుస్నాబాద్, అక్టోబర్ 01 (చైతన్యగళం): హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమాన్ని గురువారం సర్పంచ్ వెన్న స్వర్ణలత రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఉదయం పూట...
కరీంనగర్
15 రోజుల్లో మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక కరీంనగర్, అక్టోబరు 1 (చైతన్యగళం): జిల్లాలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును వేగవంతం చేసేందుకు 15 రోజుల్లో మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మండలాల అభివృద్ధిలో ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు కీలకంగా...
కరీంనగర్
గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తాం.. అపోహలు, ఆందోళనలు వద్దు: కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్, అక్టోబరు 1 (చైతన్యగళం): నారాయణపూర్ రిజర్వాయర్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 100 శాతం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. గ్రామస్తులు అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా...
కరీంనగర్
300 కుటుంబాలకు ఇళ్లు కోల్పోయిన పరిస్థితి చిగురుమామిడి,అక్టోబర్ 1(చైతన్యగళం) కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల కేంద్రంలో కొత్తపల్లి - హుస్నాబాద్ ఫోర్ లైన్ రహదారి నిర్మాణం పై ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు రిలే నిరహార దీక్ష చేపట్టారు. రహదారి ఫోర్ లైన్ నిర్మాణంతో గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 300...
తెలంగాణ
సిద్దిపేట, అక్టోబర్ 1 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓటర్లను నోటీసులు, అవసరమైన పత్రాల కోసం కార్యాలయాలకు పిలవరాదని, బీఎల్‌ఓలు ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసి,...
తెలంగాణ
సిద్దిపేట, అక్టోబర్ 1 (చైతన్యగళం): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ఐడీఓసీలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలకు వయోవృద్ధులను గౌరవించడం, వారితో ప్రేమాభిమానాలతో మెలగడం నేర్పించాలని సూచించారు. కుటుంబంలో వయోవృద్ధుల పాత్ర ఎంతో ముఖ్యమని,...
కరీంనగర్
కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సేవా దృక్పథం కలిగిన గౌరిశెట్టి తిరుపతి (86) గురువారం సాయంత్రం పరమపదించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాపార, పారిశ్రామిక, సామాజిక, విద్యా, సేవా, ఆధ్యాత్మిక రంగాల్లో అనేక ప్రతిష్ఠాత్మక బాధ్యతలు నిర్వహిస్తూ విశేష సేవలందించారు. గత 20 ఏళ్లకు పైగా...
కరీంనగర్
కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): కరీంనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో నిర్వహించిన తనిఖీల్లో 200 మి.లీ. కూల్‌డ్రింక్ గాజు సీసాల మూతల వద్ద తుప్పు పట్టినట్లు ఆహార భద్రతా శాఖ అధికారులు గుర్తించారు. అదే ఉత్పత్తికి చెందిన ఇతర సీసాల్లోనూ ఇదే సమస్య కనిపించడంతో, సరఫరా చేస్తున్న పంపిణీ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ సుమారు 60...
కరీంనగర్
కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): కరీంనగర్‌లో జీఎన్‌ఎం విద్యార్థిని రజిత (20) గురువారం ఉదయం బలవన్మరణానికి పాల్పడింది. వేధింపులే కారణమని ఆమె తండ్రి రమేష్ ఫిర్యాదు చేసినట్లు 2 టౌన్ సీఐ సుజన్ రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లిలోని ఓ కళాశాలలో చదువుతూ నర్సుగా పనిచేస్తున్న రజితను మరో వ్యక్తితో మాట్లాడుతోందంటూ గీత అనే మహిళ వేధించేదని...
కరీంనగర్
హుజురాబాద్, అక్టోబర్ 1 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ వద్ద గత నెల 27న రాత్రి జరిగిన రాకేష్ (కమలాపూర్ మండలం ఉప్పలపల్లి) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు...