Friday, October 2, 2026
Homeతెలంగాణకరీంనగర్శాంతిభద్రతలకి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. డీజే, డ్రోన్లపై నిషేధం

శాంతిభద్రతలకి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. డీజే, డ్రోన్లపై నిషేధం

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం):

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, సంబంధిత ఏసీపీల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఆయుధాలు ధరించి సంచరించడం, రోడ్లు, ప్రజా స్థలాల్లో జనాన్ని సమీకరించడం, అనుమతి లేని ప్రాంతాల్లో మ్యూజిక్, పాటలు, ప్రసంగాలు, రణగొణ ధ్వనులు చేయడం నిషేధమని తెలిపారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

కమిషనరేట్ పరిధిలో భద్రతా కారణాల దృష్ట్యా పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వినియోగంపై కూడా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. వీటిని వినియోగించాలంటే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు శబ్దకాలుష్యంతో ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో మైక్ సెట్లు వినియోగించాల్సి వస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!