Friday, October 2, 2026
Homeతెలంగాణకోడలిగా అడుగుపెట్టి… కూతురిగా నిలిచిన నర్మదా...

కోడలిగా అడుగుపెట్టి… కూతురిగా నిలిచిన నర్మదా…

📰 Generate e-Paper Clip

  • కుటుంబ బంధాలకు నర్మదా ఓ ఆదర్శం
  • బొడ్ల వెంకటయ్య 80వ జన్మదిన వేడుకల్లో కుటుంబ విలువలకు ప్రాధాన్యం

మహబూబాబాద్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌వీఎల్‌ ఫంక్షన్‌హాల్‌లో బొడ్ల వెంకటయ్య 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉగ్రశాంతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ ముడుంబై లక్ష్మీనారాయణాచార్యుల ఆధ్వర్యంలో ఆవాహిత కలశారాధన, రుద్రాభిషేకం, మూలమంత్ర హోమాలు, ఆయుష్య హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కలశస్నపనం, వేద ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణాచార్యులు మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. వెంకటయ్య కోడలు బొడ్ల నర్మదా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మెలుగుతూ పెద్దల పట్ల చూపుతున్న గౌరవం, చిన్నల పట్ల చూపుతున్న ప్రేమ కుటుంబ విలువలకు నిదర్శనంగా నిలిచిందన్నారు.

మామగారిని కుటుంబ పెద్దగా భావిస్తూ ప్రేమాభిమానాలతో చూసుకోవడంతో పాటు ఆడపడుచును సొంత తోబుట్టువుగా, ఆమె పిల్లలను తన పిల్లలతో సమానంగా భావిస్తూ నర్మదా చూపుతున్న ఆప్యాయత ఆదర్శప్రాయమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబాలను నిలబెట్టేది ఆస్తులు, అంతస్తులు కాదని.. పరస్పర ప్రేమ, గౌరవం, నమ్మకం, ఆప్యాయతలేనని ఈ వేడుక చాటిచెప్పిందన్నారు.

వెంకటయ్య 80వ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. నర్మదా–రామకృష్ణ దంపతులు పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!