హుస్నాబాద్, అక్టోబర్ 01 (చైతన్యగళం):
హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమాన్ని గురువారం సర్పంచ్ వెన్న స్వర్ణలత రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యంతో పాటు చదువుపై శ్రద్ధ పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సతీష్, ఉపాధ్యాయునిలు సరస్వతీదేవి, ఝాన్సీ, నాయకులు సొల్లు రామస్వామి, బత్తుల సారయ్య, గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
