Friday, October 2, 2026
Homeతెలంగాణమహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం

📰 Generate e-Paper Clip

  • అమృత్‌ భారత్‌ పనుల పరిశీలన.. అదనపు సౌకర్యాలపై దృష్టి

మహబూబాబాద్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో అమృత్‌ భారత్‌ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటి, ప్రయాణికులు, పట్టణ ప్రజలతో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జూట్‌ సంచులను పంపిణీ చేశారు.

స్టేషన్‌లోని సమస్యలను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందిస్తామని జీఎం తెలిపారు. ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జ్యోతి తదితరులు మహబూబాబాద్‌ పట్టణంలోని రైల్వే సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహబూబాబాద్‌, గార్ల, ఇల్లందు ప్రాంతాల ప్రజలు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!