కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం):
కరీంనగర్‌లో జీఎన్‌ఎం విద్యార్థిని రజిత (20) గురువారం ఉదయం బలవన్మరణానికి పాల్పడింది. వేధింపులే కారణమని ఆమె తండ్రి రమేష్ ఫిర్యాదు చేసినట్లు 2 టౌన్ సీఐ సుజన్ రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లిలోని ఓ కళాశాలలో చదువుతూ నర్సుగా పనిచేస్తున్న రజితను మరో వ్యక్తితో మాట్లాడుతోందంటూ గీత అనే మహిళ వేధించేదని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులు భరించలేక హాస్టల్లో రజిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
