హుజురాబాద్, అక్టోబర్ 1 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ వద్ద గత నెల 27న రాత్రి జరిగిన రాకేష్ (కమలాపూర్ మండలం ఉప్పలపల్లి) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు ఏసీపీ మాధవి, సీఐ తెలిపారు.
