Friday, October 2, 2026
Homeతెలంగాణవయోవృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి

వయోవృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, అక్టోబర్ 1 (చైతన్యగళం):

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ఐడీఓసీలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలకు వయోవృద్ధులను గౌరవించడం, వారితో ప్రేమాభిమానాలతో మెలగడం నేర్పించాలని సూచించారు. కుటుంబంలో వయోవృద్ధుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి అనుభవాలు, సూచనలు ఎంతో విలువైనవని తెలిపారు.

జిల్లా సంక్షేమ అధికారి శారద వయోవృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హక్కులు, చట్టపరమైన రక్షణల గురించి వివరించారు. వయోవృద్ధులకు ఎదురయ్యే సమస్యలు, అవసరాల కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ 14567ను వినియోగించుకోవాలని సూచించారు.

డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో వయోవృద్ధ మహిళలను కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక సాధికారత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వయోవృద్ధులను ఘనంగా సన్మానించి, వారు అందించిన సేవలు, అనుభవాలను గుర్తించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు జె. భిక్షపతి, పి. రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి మహిళా సంఘాల సభ్యులు, వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!