Thursday, October 29, 2026
Homeతెలంగాణకరీంనగర్అక్కన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి

అక్కన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

  • రైతులకు న్యాయం చేయకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలి: బీజేపీ మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌ రెడ్డి

అక్కన్నపేట, అక్టోబర్‌ 29 (చైతన్యగళం):

అక్కన్నపేట మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రామంచ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటల పరిస్థితులను పరిశీలించాలని కోరారు. అక్కన్నపేట మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించి రైతులకు అవసరమైన సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని, కరువు పరిస్థితులపై సమగ్ర పరిశీలన చేపట్టి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవడంలో విఫలమైతే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, సమస్యను పరిష్కరించకపోతే రైతుల పక్షాన బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునావత్‌ మోహన్‌ నాయక్‌, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోత్‌ తిరుపతి నాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్‌ లకపతి, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్‌, మడక రవికుమార్‌, మండల ఉపాధ్యక్షులు అర్జున్‌ నాయక్‌, సంక్రీ సంతోష్‌, మండల కార్యదర్శి కళ్యాణ్‌ విష్ణు, మండల కోశాధికారి సమిరెడ్డి, సలేంద్ర తిరుపతి, గంగుల కుమార్‌, తిరుమల రాజు, మాలోత్‌ రాజు నాయక్‌, మెడబోయిన స్వామి, బానోత్‌ సుమన్‌, దారణ రాజు, వేముల శ్రీనివాస్‌, మిట్టపెల్లి కుమార్‌, మిట్టపెల్లి సత్యనారాయణ, జిల్లా కనకయ్య, వేముగంటి తేజ, మొక్కెర అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!