Sunday, November 15, 2026
Homeతెలంగాణకరీంనగర్బీసీ కాలనీ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

బీసీ కాలనీ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు.. స్వీట్లు, పండ్ల పంపిణీ

ఎల్కతుర్తి, నవంబర్ 14 (చైతన్యగళం):

ఎల్కతుర్తి మండలంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పిల్లలంటే ఎంతో ఇష్టపడే నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తూ బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటలు, నృత్యాలు, ప్రసంగ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!