అక్కన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి

రైతులకు న్యాయం చేయకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలి: బీజేపీ మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌ రెడ్డి అక్కన్నపేట, అక్టోబర్‌ 29 (చైతన్యగళం): అక్కన్నపేట మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామంచ మహేందర్‌ రెడ్డి...