సైదాపూర్, అక్టోబరు 28 (చైతన్యగళం):
సైదాపూర్ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సైదాపూర్ పాత బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
కరువు పరిస్థితులతో నష్టపోతున్న రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం, ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. సైదాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెల్మల్ల రాజేశ్వర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సోమరపు రాజయ్య, సర్పంచులు చాడ అఖిల ప్రకాశ్‌రెడ్డి, మేడవేని గోపాల్, మాచమల్ల శ్రీకాంత్, ఉపసర్పంచులు కె. వీరస్వామి, కె. వినయ్, టి. శ్రీనివాస్‌తో పాటు బీఆర్ఎస్ మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
