సైదాపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి
సైదాపూర్, అక్టోబరు 28 (చైతన్యగళం): సైదాపూర్ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సైదాపూర్ పాత బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరువు పరిస్థితులతో నష్టపోతున్న రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం, ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. సైదాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు...