Thursday, October 29, 2026
Homeతెలంగాణబాలల భద్రతపై న్యాయ అవగాహన కార్యక్రమం

బాలల భద్రతపై న్యాయ అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, అక్టోబర్ 28 (చైతన్యగళం):

బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కృషి చేయాలని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ. కుమారస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. సుదర్శన్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ న్యూ హైస్కూల్‌లో పోక్సో చట్టం–2012పై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుమారస్వామి మాట్లాడుతూ, విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, బాలల హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా అసౌకర్యంగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని తెలిపారు. పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు పోక్సో చట్టం–2012 అమలులో ఉందని వివరించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. వెంకట రమణ, సీనియర్ ఉపాధ్యాయుడు జి. తిరుపతిరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!