Friday, October 30, 2026
Homeతెలంగాణకరీంనగర్చొప్పదండిని కరువు మండలంగా ప్రకటించాలి

చొప్పదండిని కరువు మండలంగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

  • రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారిని ఆదుకోవాలి

గంగాధర, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): చొప్పదండి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ గ్రామీణ మండల అధ్యక్షుడు మొగిలి మహేష్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చొప్పదండి డిప్యూటీ తహసీల్దార్‌ సర్దార్‌ మన్‌మిత్‌ సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు.

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నందున గ్రామపంచాయతీల వారీగా ముందస్తు ప్రణాళికలు రూపొందించి నీటి సమస్యను నివారించాలని కృష్ణారెడ్డి కోరారు. బావులు ఎండిపోవడం, కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతులు పంటలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. బాధిత రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతుల రుణాలపై వడ్డీని మాఫీ చేయడంతో పాటు దీర్ఘకాలిక రుణాల వాయిదాలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పంటలు సాగు చేయలేని పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రూ.36 వేల నిధులను ప్రతి కూలీకి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ గౌడ్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు గొల్లగట్టయ్య, మండల ప్రధాన కార్యదర్శులు జిట్ట కుమార్‌, కొమ్ము రమేష్‌, ఎడ్ల సురేష్‌, చల్ల అనూష్‌, సీనియర్‌ నాయకులు తోట కోటేష్‌, బైరగొని కిట్టు గౌడ్‌, తిరుపతి గౌడ్‌, జక్కుల శంకర్‌, తాటికొండ కుమార్‌, రాపెళ్లి శ్రీనివాస్‌, మంచికట్ల మల్లేష్‌, కళ్లెం మనిష్‌రెడ్డి, అమరకొండ తిరుపతి, గుండె వెంకటేష్‌, గుర్రం సమరసింహారెడ్డి, సాదుల రమేష్‌, వడ్లూరి సుధాకర్‌, ముద్దం చందు, పాలోజి వెంకటరమణ, అఖిల్‌, లింగంపల్లి కళ్యాణ్‌, మ్యాకల రాములు, మడ్డి పరుశురాములు, రాజేందర్‌, పోరండ్ల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!