చొప్పదండిని కరువు మండలంగా ప్రకటించాలి
రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారిని ఆదుకోవాలి గంగాధర, అక్టోబర్ 28 (చైతన్యగళం): చొప్పదండి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ గ్రామీణ మండల అధ్యక్షుడు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చొప్పదండి డిప్యూటీ తహసీల్దార్ సర్దార్ మన్మిత్ సింగ్కు వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నందున గ్రామపంచాయతీల వారీగా...