Wednesday, October 28, 2026
Homeతెలంగాణకరీంనగర్పోలీసింగ్‌ మరింత పటిష్టం కావాలి

పోలీసింగ్‌ మరింత పటిష్టం కావాలి

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీపీ గౌష్‌ ఆలం వార్షిక తనిఖీలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో మరింత సమర్థంగా పనిచేయాలని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కరీంనగర్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించి, స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుమల్‌ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు.

తనిఖీల్లో భాగంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులను కమిషనర్‌ సమగ్రంగా పరిశీలించారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, క్షేత్రస్థాయిలో వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకత, వేగం పెంచేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కేసులకు సంబంధించిన వస్తువులను భద్రంగా పరిరక్షించాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. నేరాల నియంత్రణలో నిఘా కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, స్టేషన్‌ పరిధిలోని అన్ని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. పెట్రోలింగ్‌ వాహనాలు, ఆధునిక పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, అవసరమైన నిర్వహణ చేపట్టాలని తెలిపారు. పోలీసు వాహనాలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వినియోగంలో లేని పాత సామగ్రిని కమిషనరేట్‌కు తరలించి, పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుమల్‌, ఎస్‌ఐ చేరాలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!