మంథని, అక్టోబర్ 26 (చైతన్యగళం): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మంథని నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిధులను కేటాయించారు. అంబేద్కర్ భవనం నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని స్థానికంగా పేర్కొన్నారు.
