- విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంథని, అక్టోబర్ 26 (చైతన్యగళం): విద్యార్థులను ప్రోత్సహించి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొయ్యూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ విద్యార్థులతో ముచ్చటిస్తూ.. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవడం, విద్యారంగ అభివృద్ధికి తోడ్పడటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.
