Monday, October 19, 2026
Homeతెలంగాణకరీంనగర్అక్కన్నపేటలో బంజారా భవన్‌ మంజూరు చేయాలి

అక్కన్నపేటలో బంజారా భవన్‌ మంజూరు చేయాలి

📰 Generate e-Paper Clip

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బంజారా నాయకుల విజ్ఞప్తి

కరీంనగర్‌, అక్టోబర్‌ 19 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో బంజారా భవన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ బంజారా నాయకులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. అక్కన్నపేట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్‌ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు, బంజారా నాయకులు ఆదివారం కరీంనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మండలంలో బంజారా భవన్‌ నిర్మాణ ఆవశ్యకతను మంత్రికి వివరించారు. బంజారా సామాజిక వర్గ ప్రజలు తమ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి భవన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. బంజారా ప్రజల సౌకర్యార్థం భవన్‌ మంజూరు చేసి నిర్మాణానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాణోతు వెంకట్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు, బంజారా నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!