Monday, October 19, 2026
Homeతెలంగాణకరీంనగర్పూల పండుగ.. బతుకమ్మ సంబురం

పూల పండుగ.. బతుకమ్మ సంబురం

📰 Generate e-Paper Clip

  • మానకొండూరు మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
  • గంగిపెల్లిలో బతుకమ్మలకు బహుమతుల ప్రదానం

మానకొండూరు, అక్టోబర్‌ 19 (చైతన్యగళం): పూల సోయగాలు.. బతుకమ్మ పాటలు.. కోలాటాల సందడితో మానకొండూరు మండలంలోని పలు గ్రామాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఆదివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ఆడపడుచులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేసి వేడుకలను ముగించారు.

గంగిపెల్లిలో బతుకమ్మలకు బహుమతులు

గంగిపెల్లి గ్రామంలోని కెనాల్‌ పల్లెలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు పోటీపడి అందంగా పేర్చిన బతుకమ్మలకు ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. దీంతో మహిళల్లో మరింత ఉత్సాహం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు గ్రామాల్లో ఐక్యత, సంతోషాన్ని వెల్లివిరిసేలా చేశాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి వాల ప్రదీప్‌రావు, ఉపసర్పంచి ఇడుమాల సంపత్‌, వార్డు సభ్యులు, జిల్లెల పరశురాములు, చౌదరి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!