అక్కన్నపేటలో బంజారా భవన్‌ మంజూరు చేయాలి

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బంజారా నాయకుల విజ్ఞప్తి కరీంనగర్‌, అక్టోబర్‌ 19 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో బంజారా భవన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ బంజారా నాయకులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. అక్కన్నపేట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్‌ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు, బంజారా నాయకులు ఆదివారం కరీంనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండలంలో బంజారా భవన్‌ నిర్మాణ ఆవశ్యకతను...