- చారిత్రక, పర్యాటక ప్రదేశాలపై వీడియోల చిత్రీకరణకు గుర్తింపు
హుస్నాబాద్, సెప్టెంబరు 25 (చైతన్యగళం): జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన జిల్లా టూరిజం క్లబ్ పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. ఈ విషయాన్ని జిల్లా పర్యాటక శాఖ నోడల్ అధికారి ప్రకటించడంతో కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్, అధ్యాపకులు శుక్రవారం విద్యార్థులను అభినందించి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
హుస్నాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని చారిత్రక, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలపై విద్యార్థులు రూపొందించిన వీడియోలకు ఈ బహుమతి లభించినట్లు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.
అనంతరం వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
కార్యక్రమంలో అధ్యాపకులు డా.ఎస్.ఎస్.రాజు, ఎస్.సత్యనారాయణ, వి.సదాశివ్, వి.రజని, బి.ఎల్లయ్య, బి.వాల్య, ఎస్.వెంకట ముత్యం, సిహెచ్.విద్యాసాగర్, పి.చంద్రమోహన్, టి.రణధీర్కుమార్, సిహెచ్.రాజిరెడ్డి, ఎస్.అశోక్, ఎం.వెంకటేష్, ఏ.మమత, గ్రంథపాలకులు ఆర్.వాసవి, వెంకటసాయి, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.
