Saturday, September 26, 2026
Homeక్రీడలుజిల్లా కబడ్డీ ఛాంపియన్‌గా హుస్నాబాద్‌

జిల్లా కబడ్డీ ఛాంపియన్‌గా హుస్నాబాద్‌

📰 Generate e-Paper Clip

  • 17 ఏళ్ల బాలుర విభాగంలో దుబ్బాకపై విజయం

సిద్దిపేట, సెప్టెంబరు 25 (చైతన్యగళం): సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన 70వ జిల్లా స్థాయి పాఠశాలల కబడ్డీ పోటీల్లో హుస్నాబాద్‌ మండల జట్టు సత్తా చాటింది. 17 ఏళ్ల బాలుర విభాగంలో ఫైనల్‌లో దుబ్బాక మండల జట్టుపై విజయం సాధించి జిల్లా ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా హుస్నాబాద్‌ ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ క్రీడాకారులను అభినందించారు. జిల్లా ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ చిత్తారి పద్మ, వార్డు కౌన్సిలర్‌ వరప్రసాద్‌, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ కే.లింగమూర్తి, ఎంఈఓ బండారి మనీలా, పెద్దబడి ఉపాధ్యాయులు కె.వాసుదేవరెడ్డి, కబడ్డీ కోచ్‌ కృష్ణ అభినందనలు తెలిపారు.

అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి నర్రా భాస్కర్‌రెడ్డి, జిల్లా టీజీ పీఈటీ అధ్యక్షుడు ఏర్వ అశోక్‌, టీఎస్‌ పీఈటీ అధ్యక్షుడు తోట సతీష్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, సీనియర్‌ క్రీడాకారుడు గద్దల రమేష్‌ చేతుల మీదుగా క్రీడాకారులకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు.

కార్యక్రమంలో పీడీలు సుజాత, వెంకట నర్సయ్య, వెంకటస్వామి, రవి, డేవిడ్‌, దేవరాజు, నవీన్‌, అఖిల్‌, శ్రీనివాస్‌, రాజేందర్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!