టూరిజం క్లబ్‌ పోటీల్లో హుస్నాబాద్‌ విద్యార్థులకు తృతీయ బహుమతి

చారిత్రక, పర్యాటక ప్రదేశాలపై వీడియోల చిత్రీకరణకు గుర్తింపు హుస్నాబాద్‌, సెప్టెంబరు 25 (చైతన్యగళం): జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన జిల్లా టూరిజం క్లబ్‌ పోటీల్లో హుస్నాబాద్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. ఈ విషయాన్ని జిల్లా పర్యాటక శాఖ నోడల్‌ అధికారి ప్రకటించడంతో కళాశాల ప్రిన్సిపల్‌ చెన్నూరి గంగాధర్‌, అధ్యాపకులు శుక్రవారం విద్యార్థులను అభినందించి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. హుస్నాబాద్‌ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని చారిత్రక, వారసత్వ...