- వారంరోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికుల ఆవేదన
హుస్నాబాద్, సెప్టెంబరు 25 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని 11వ వార్డులో వారం రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. వార్డులో నిర్మించిన నీటి ట్యాంకులో సుమారు ఏడాది కాలంగా తాగునీటిని నింపడం లేదని పేర్కొన్నారు.
సమస్యపై స్పందించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు ఐలేని మల్లికార్జున్‌రెడ్డి శుక్రవారం నీటి ట్యాంకును పరిశీలించారు. అనంతరం సమస్యను హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, వార్డు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
