Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాలబద్రి శంకర్

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాలబద్రి శంకర్

📰 Generate e-Paper Clip

  • పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కీలక బాధ్యతలు.. నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం

కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం):

కరీంనగర్‌ పట్టణంలోని రేకుర్తి ప్రాంతానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బాలబద్రి శంకర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి సత్యం శుక్రవారం కరీంనగర్‌లోని తన శిబిర కార్యాలయంలో బాలబద్రి శంకర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

బాలబద్రి శంకర్‌ 1996 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌, నగర కాంగ్రెస్‌ విభాగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి తనవంతు సేవలందించారు. ఆయన రాజకీయ అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత, కష్టకాలంలోనూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన తీరును గుర్తించిన పార్టీ నాయకత్వం జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలోనూ జెండాను మోస్తూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం శ్రమించే నాయకులకు కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగించిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి సత్యంకు బాలబద్రి శంకర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాయకత్వం సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీనియర్‌ నాయకుడికి జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు లభించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!