సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం):
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన జె. విజయ్సాగర్ను తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సమాఖ్య (టీజీటిటీఎఫ్) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ భేటీలో జిల్లాలో గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని టీజీటిటీఎఫ్ నాయకులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులకు సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీటిటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు పాల్గొన్నారు.
