Thursday, November 19, 2026
Homeతెలంగాణకరీంనగర్విద్యార్థులకు చట్టాలపై అవగాహన

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

📰 Generate e-Paper Clip

  • మోటారు వాహనాలు, పోక్సో చట్టాలపై న్యాయవాదుల అవగాహన సదస్సు

తిమ్మాపూర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఆరుగురు న్యాయవాదులు, ఒక వాలంటీర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోటారు వాహనాల చట్టం, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టం గురించి విద్యార్థులకు వివరించారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలు, నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, వాటి అక్రమ కార్యకలాపాలకు సహకరించడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు, విధించే శిక్షల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, చట్టాల పట్ల గౌరవంతో వ్యవహరించాలని సూచించారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరమని, విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన న్యాయ బృందానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!