విద్యార్థులకు చట్టాలపై అవగాహన
మోటారు వాహనాలు, పోక్సో చట్టాలపై న్యాయవాదుల అవగాహన సదస్సు తిమ్మాపూర్, అక్టోబర్ 28 (చైతన్యగళం): విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఆరుగురు న్యాయవాదులు, ఒక వాలంటీర్ హాజరయ్యారు....