Thursday, November 19, 2026
Homeతెలంగాణకరీంనగర్అయ్యప్ప దీక్షాకాల ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు

అయ్యప్ప దీక్షాకాల ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు

📰 Generate e-Paper Clip

  • భిక్ష కార్యక్రమం, పడిపూజ దాతల విరాళాల పెంపు

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

హుస్నాబాద్‌లోని సిద్దేశ్వర గుట్టపై కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దీక్షాకాల పూజలు, ఉత్సవాలు, సేవా కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఉత్సవాల నిర్వహణకు సంబంధించి భక్తులు, కమిటీ సభ్యులు అందించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకున్నారు.

2026 నవంబర్‌ 25 నుంచి 2027 జనవరి 5 వరకు నిర్వహించనున్న భిక్ష కార్యక్రమానికి ఒక్కో దాత నుంచి రూ.6,516గా నిర్ణయించారు. గత ఏడాది ఈ మొత్తం రూ.6,116గా ఉండగా, ఈసారి రూ.400 పెంచారు. అదేవిధంగా పడిపూజ మహోత్సవంలో మెట్టు దాతకు రూ.2,516గా నిర్ణయించారు. గత ఏడాది రూ.2,116గా ఉన్న ఈ మొత్తాన్ని రూ.400 పెంచారు.

మాలధారణ, ఇరుముడి టికెట్ల ధరను గతంలో మాదిరిగానే రూ.100గా కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. పంబా ఆరట్టు కార్యక్రమాన్ని కూడా యథావిధిగా నిర్వహించాలని తీర్మానించారు. దీక్షాకాలంలో నిర్వహించే భిక్ష కార్యక్రమానికి వంట చేసే వ్యక్తికి రోజుకు రూ.3,000 పారితోషికం చెల్లించాలని నిర్ణయించారు.

అయ్యప్పస్వామి దీక్షాకాల పూజలు, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, దాతలు, కమిటీ సభ్యులు సహకరించాలని నిర్వాహకులు కోరారు. దేవాలయ అభివృద్ధితోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!