- పశువులకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు
హుస్నాబాద్, అక్టోబర్ 29 (చైతన్యగళం):
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పశువుల సంరక్షణకు అవసరమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాలు, మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టె నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ముగ్గు వేశారు.
వేసవి, వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పశువులకు అవసరమైన నీటి సదుపాయం కల్పించడం ద్వారా వాటి సంరక్షణకు తోడ్పడవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, మండల అభివృద్ధి అధికారి సురేశ్, ఏపీవో పద్మ, ఈసీ, సాంకేతిక సహాయకుడు పరశురాం, పంచాయతీ కార్యదర్శి మహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
