- మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలు
ఎల్కతుర్తి రూరల్, అక్టోబర్ 29 (చైతన్యగళం):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన కందికొండ కోటిలింగం, పాండ్రాల సదానందం భారతీయ జనతా పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన నాయకులు మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అల్లికుమార్, చిదురల వెంకటేష్, ఉపాధ్యక్షుడు అంబ్బీర్ శ్రీనివాస్, దామెర శక్తి కేంద్ర ఇన్చార్జి ఠాకూర్ శాంసింగ్, సాతూరి ప్రభాకర్, చల్ల రవీందర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మంతుర్తి సమ్మయ్య, పండ్రాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
