Thursday, October 29, 2026
Homeతెలంగాణకరీంనగర్అథ్లెటిక్స్‌లో మెరిసిన హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి

అథ్లెటిక్స్‌లో మెరిసిన హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి

📰 Generate e-Paper Clip

  • 400 మీటర్ల పరుగులో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం.. జి. రిశ్వంత్‌కు ప్రిన్సిపాల్, అధ్యాపకుల అభినందనలు

హుస్నాబాద్, అక్టోబర్ 29 (చైతన్యగళం):

సిద్దిపేట జిల్లా స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) విద్యార్థి జి. రిశ్వంత్ ప్రతిభ చాటాడు. అండర్‌-19 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్‌తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించింది.

2026 అక్టోబర్ 26న సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వారితో పోటీపడిన రిశ్వంత్ 400 మీటర్ల పరుగులో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. క్రీడలపై ఆసక్తి, నిరంతర సాధన, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించడంపై కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమయపాలన, పట్టుదల, జట్టుస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొని కళాశాలకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతోపాటు క్రీడలకు కూడా కళాశాల ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

జి. రిశ్వంత్ సాధించిన విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఎస్. రాజు, ఎస్. సత్యనారాయణ, వి. సదాశివ్, వి. రజనీ, బి. ఎల్లయ్య, బి. వాల్య, ఎస్. వెంకట ముత్యం, పి. చంద్రమోహన్, టి. రణధీర్ కుమార్, సిహెచ్. రాజిరెడ్డి, ఎస్. అశోక్, ఆర్. వెంకటేష్, ఏ. మమత, గ్రంథపాలకులు ఆర్. వాసవి, వెంకటసాయి, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!