పోలీసింగ్ మరింత పటిష్టం కావాలి
కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీపీ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు కరీంనగర్, అక్టోబర్ 28 (చైతన్యగళం): ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో మరింత సమర్థంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ పూలమొక్క అందజేసి స్వాగతం...