మంచాల, సెప్టెంబరు 27 (చైతన్యగళం): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
మంచాల మండలం ఆంబోత్ తండా సర్పంచ్ రాణి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రఘునాయక్‌తో పాటు సుమారు 150 మంది కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామాల్లో గతంలో జరగని అభివృద్ధి పనులు రెండున్నరేళ్లలో చేపట్టినట్లు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, తగిన గౌరవం కల్పిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన వారిలో వార్డు సభ్యులు హరి, మౌనిక, చందర్, సీనియర్ నాయకులు బిచ్య నాయక్, రాములు, భాను, హరిలాల్, హనుమంతు, కుమార్, శ్రీరాములు, నంద, దేవదర్, గోపాల్, చిన్నా, రవి, రాజు, కిషన్, సాలా, జిన్ను, విజయ, జ్యోతి, బుజ్జి, సునీత, రజిత, సురేష్, రఘు, పండు, శంకర్, నాగరాజు, జబ్బర్, శ్యామల, బిక్షపతి, దుధ్య భీమ, కిరణ్, నితిన్, మహేష్, ప్రవీణ్, విజయ్, కిషోర్, తరుణ్‌రాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్‌నాయక్, మంచాల పీఏసీఎస్ చైర్మన్ వెదిరే హన్మంత్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి బైరిక రమాకాంత్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
