కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

మంచాల, సెప్టెంబరు 27 (చైతన్యగళం): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మంచాల మండలం ఆంబోత్‌ తండా సర్పంచ్‌ రాణి శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ రఘునాయక్‌తో పాటు సుమారు 150 మంది కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి...