మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు తల్లాడ వెంకట రామారావు, ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మలకు బహుమతులు అందజేశారు.

ఈ పోటీల్లో శ్రీ వాసవి ప్రింటర్స్, ఎస్ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్ అధినేత బొడ్ల రామకృష్ణ, నర్మదా దంపతులు పేర్చిన బతుకమ్మకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా బొడ్ల రామకృష్ణ–నర్మదా దంపతులు మాట్లాడుతూ, సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బహుమతి అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను, సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వేడుకలను నిర్వహించడం ద్వారా మన సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, గిరిధర్ గుప్తా, మాలే శ్రవణ్ (చిన్నా), కామేశ్వర్ రావు, సోమ శ్రీను, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
