Monday, September 28, 2026
Homeతెలంగాణరంగారెడ్డిఅందరూ చదువుకుని విజ్ఞానం వైపు అడుగులు వేయాలి: సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌

అందరూ చదువుకుని విజ్ఞానం వైపు అడుగులు వేయాలి: సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌

📰 Generate e-Paper Clip

యాచారం, సెప్టెంబరు 27 (చైతన్యగళం): ప్రతి ఒక్కరూ చదువుకుని అజ్ఞానాన్ని వీడి విజ్ఞానం వైపు అడుగులు వేయాలని మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌ అన్నారు. యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఆదివారం ఉల్లాస్‌–నవభారత సాక్షరత కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్వశక్తి సంఘాల మహిళల్లో 15 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్‌ తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవడం ద్వారా సమాజాన్ని అర్థం చేసుకుని, తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే నవభారత సాక్షరత కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డైరెక్టర్‌ మక్కపల్లి స్వరూప మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం ఉల్లాస్‌ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మహిళలందరికీ విద్యను అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామ వీవోలు హైమావతి, రామాదేవి, కళ్ళు స్వప్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!