Thursday, September 24, 2026
Homeతెలంగాణతాడిపత్రిలో విఘ్నేశ్వర యూత్‌ ఆధ్వర్యంలో అన్నప్రసాదం

తాడిపత్రిలో విఘ్నేశ్వర యూత్‌ ఆధ్వర్యంలో అన్నప్రసాదం

📰 Generate e-Paper Clip

  • యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ సత్యనారాయణ

యాచారం, సెప్టెంబరు 24 (చైతన్యగళం): యాచారం మండలం తాడిపత్రి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వర యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద గురువారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మా సిటీ పోలీస్‌స్టేషన్‌ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సునీల్‌ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలు, మద్యపానం, ఆన్‌లైన్‌ ఆటలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యాంటీ డ్రగ్‌ సైనికులుగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించి నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. యువత మంచి మార్గంలో నడుస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు నీలం రాములు, వార్డు సభ్యుడు యూసుఫ్‌ పఠాన్‌, మొతకని మంజుల, విఘ్నేశ్వర యూత్‌ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!