Thursday, September 24, 2026
Homeతెలంగాణహైదరాబాద్విజయపురి కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

విజయపురి కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): బైరామల్‌గూడ, కర్మన్‌ఘాట్‌ పరిధిలోని విజయపురి కాలనీలో సౌజన్య శాంతినికేతన్‌ పాఠశాల వద్ద వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి నిర్వహించారు. కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

రూ.45,001కు లడ్డూ

పూజల అనంతరం నిర్వహించిన గణపతి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. గోవిందు కిరణ్‌ రూ.45,001కు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను అభినందించారు.

గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి నెలకొనాలని కాలనీ ప్రజలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సుదర్శన్‌, కిషన్‌, నరేందర్‌, గోవింద్‌ కిరణ్‌, సోమనాథ్‌, వెంకటరెడ్డి, సందీప్‌, భరత్‌కుమార్‌, బన్నీ, కమలాకర్‌, సుజిత్‌, రామ్‌చరణ్‌, చిన్నారి హాసినితో పాటు కాలనీ ప్రజలు, నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!